రూ. 8 లక్షలు పలికిన.. భోలక్ పూర్ బంగారు లడ్డు

వినాయక నిమజ్జనాలు హైదరాబాద్ లో ఊపందుకున్నాయి. నిమజ్జనానికి ముందు లడ్డూ, పండ్లు, పూలదండల వేలం వేస్తున్నారు. వీటిని భారీ ధరలతో దక్కించుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలోనే ..హైదరాబాద్‌లోని భోలక్‌ పూర్ వాసులు మరో అడుగు ముందుకేసి ఏకంగా బంగారు లడ్డును స్వామివారికి నివేదించారు. ఇది భక్తులను బాగా ఆకట్టుకుంది.

దీన్ని ఇవాళ (సెప్టెంబర్-22) వేలం వేయగా, కాడబోయిన భాస్కర్ అనే వ్యక్తి రూ. 8 లక్షల వెయ్యి రూపాయలకు సొంతం చేసుకున్నాడు. భోలక్‌ పూర్‌లోని శ్రీసిద్ధి వినాయక భగత్‌సింగ్‌ యూత్‌ అసోసియేషన్‌ వారు ఈ  గోల్డ్ లడ్డును చేయించారు. అసోసియేషన్‌ 15 ఏళ్లుగా మండపాన్ని ఏర్పాటు చేసి ..వేడుక జరుపుతోంది. 15 ఏళ్ల నుంచి లడ్ల వేలంలో వచ్చిన డబ్బుకు అసోసియేషన్‌ మరికొంత డబ్బు చేర్చి.. 12 తులాల బంగారంలో ఈ బంగారు లడ్డును తయారు చేయించింది. తయారీకి మొత్తం రూ.4 లక్షలు ఖర్చయింది. తెరిచి, మూసేలా ఉండే ఇందులో అసలైన లడ్డు పెట్టారు.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy