రెండు ఎన్నికల మధ్య……

telangana_300రెండు ఎన్నికలు. అప్పుడు ఇప్పుడూ ఇవే కీలకం కాబోతున్నాయి. అదీ సాధారణ ఎన్నికలే. ఈ రెండు ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రానికి విడదీయరాని సంబంధం ఉంది. ఇవే తెలంగాణ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను చాటుతున్నాయి. వీటి వల్లే ఆనాడు స్టేట్ ఆఫ్ హైద్రాబాద్ అయింది. ఇప్పుడు న్యూ స్టేట్ ఆఫ్ తెలంగాణ కాబోతోంది. ఆ ఎన్నికల ప్రత్యేకత ఏమిటో ఓ సారిచూద్దాం.

తెలంగాణ ప్రాంతానికి రెండు సాధారణ ఎన్నికలకు చారిత్రక ప్రాధాన్యం ఉంది. నాడు నిజాం పాలన నుండి హైదరాబాద్ ఇండియన్ యూనియన్ లో విలీనం అయింది. ఆ తర్వాత 1952 సాధారణ ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంతం హైద్రాబాద్ స్టేట్ గా ఆవిర్భివించింది. దానికి బూర్గుల రామకృష్ణారావు సీఎంగా ఉన్నారు. ఆయన కంటే ముందు ఈ ప్రాంతానికి ఐసీఎస్ అధికారి వెల్లోడి ముఖ్యమంత్రిగా ఉన్నారు.

అప్పట్లో నిజాం రాజ్యంపై ఇండియన్ యూనియన్ ఆపరేషన్ పోలో విజయవంతం అయ్యింది. అపుడు పరిపాలన నడిపేందుకు భారత ప్రభుత్వం తరుఫున అధికారి ఇక్కడ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించారు. ఆ తరువాత సాధారణ ఎన్నికలు జరిగాయి. అవే భారత దేశ తొలి సాధారణ ఎన్నికలు. అంటే తొలి పార్లమెంట్ ఎన్నికలన్నమాట. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగినట్లే ఇక్కడా జరిగాయి. నిజాం పాలన నుండి బయటకు వచ్చినా కొంత కాలం నిజాం నవాబే రాజ్ ప్రముఖ్ గా ఉన్నారు.

ప్రస్తుతం 2014 సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. నాడు ఆంధ్ర రాష్ట్రంతో విలీనం అయిన స్టేట్ ఆఫ్ హైద్రాబాద్ ఇప్పుడు తన అస్తత్వాన్ని తెచ్చుకుంది. అప్పటి ఎన్నికల్లో ఉన్న రాష్ట్రం తిరిగి 58 ఏళ్లకు మళ్ళీ ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న సీఎం రాజీనామా చేశారు కాబట్టి రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో భారత ప్రభుత్వం తరఫున ఇక్కడ రాష్ట్ర గవర్నర్ పాలనా వ్యవహారాలు నిర్వహించే అవకాశం ఉంది. నాటి ఎన్నికల తరువాత మూడేళ్ల పాటు రాష్ట్రంగా ఉన్న హైద్రాబాద్ రాష్ట్రం బూర్గుల రాజీనామాతో ఆంధ్ర రాష్ట్రంలో కలిసింది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంపై పార్లమెంట్ ఓ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సీఎం రాజీనామాతో రాష్ట్రపతి పాలన తప్పేట్లు లేదు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణను భారత దేశంలో 29వ రాష్ట్రంగా గెజిట్ లో పొందుపరుస్తారు. రెండు సాధారణ ఎన్నికల మధ్య తెలంగాణ అస్తిత్వం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బుచ్చన్న, స్పెషల్ కరస్పాండెంట్, V6 NEWS

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy