రెండు కోట్ల కొత్త ఇళ్లు..!

rural_urban_framew_johnli_072022 నాటికి అందరికీ ఇల్లు పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది కేంద్రం. జాతీయ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద రెండు కోట్ల కొత్త ఇళ్లు నిర్మించనున్నారు. ఈ పథకం కింద వచ్చే ఏడేళ్లలో ఒక్కో లబ్ధిదారుడికి వివిధ రూపాల్లో 1 లక్ష నుంచి 2లక్షల 30వేల వరకూ కేంద్ర సాయం అందనుంది. ఈ పథకాన్ని దేశంలోని 4,041 నగరాలు, పట్టణాలంటిలో మూడు దశల్లో అమలు చేస్తారు. లక్ష, అంతకన్నా ఎక్కువ జనాభా కల్గిన 500 నగరాలు, పట్టణాలకు ఫస్ట్ ఫేజ్ లో చాన్స్ ఇవ్వనున్నారు. ఈ పథకం అమలుకు భూ వినియోగ మార్పిడి, లే-అవుట్ ప్రణాళికలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను సింప్లిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సూచించింది. పట్టణ  ప్రాంతాల్లోని పేదలకు హౌసింగ్ లోన్లపై వడ్డీ రాయితీని 6.50 శాతానికి పెంచింది. దీనివల్ల.. ఒక్కొక్కరికి 2లక్షల 30 వేల వరకు బెనిఫిట్ అవుతుందని కేంద్రం అంచనా వేసింది. ఖరీఫ్ సీజన్ స్టార్టింగ్ లోనే… రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. వరి కనీస మద్దతు ధరను 50 రూపాయలు పెంచింది. పప్పు ధాన్యాలు క్వింటాలుకు 200 రూపాయల బోనస్ ఇవ్వాలని డెసిషన్ తీసుకుంది. సోలార్ పవర్ ప్రొడక్షన్ కెపాసిటీ టార్గెట్ ని 20వేల మెగావాట్ల నుంచి లక్ష మెగావాట్లకు పెంచింది కేంద్రం. 2022 నాటికి లక్ష మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తిని టార్గెట్ గా పెట్టుకుంది.ఎన్నికల మేనిఫెస్టోనే  లైన్ లో పెడుతోంది మోడీ సర్కార్. అర్బన్ పావర్టీకి చెక్ పెడుతూ…అందిరికీ ఇళ్లు కట్టించే స్కీమ్ ను తీసుకువచ్చింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy