రెండు బీర్లతో ఆడాళ్లకు గుండెజబ్బులు దూరం

Beer-Mugsమందేస్తే చిందేస్తారని అందరినీ తెగ తిట్టిపోస్తాం. చుక్క గురించి మాట్లాడితే అంత దూరం పరిగెట్టే వాళ్లని కూడా చూశాం. ఇదంతా అలా ఉంచితే … మందుతాగితే ఆరోగ్యానికి మంచిదే అంటోంది ఆ యూనివర్సిటీ. వారానికి రెండు బీర్లు తాగండి… గుండె జబ్బులను దూరం చేసుకోండి అంటోంది. మగాళ్లకు ఈ సలహా ఇస్తే ఏమో అనుకోవచ్చు… కానీ ఆడాళ్లను తాగమంటోంది ఆ యూనివర్సిటీ. స్వీడన్ కు చెందిన గూటెన్ బర్గ్ యూనివర్సిటీ పరిశోధనా బృందం తమ స్టడీ రిజల్ట్స్ ను బయటపెట్టింది. 50 ఏళ్లలో 1500 మంది మహిళలపై చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలిందంటున్నారు పరిశోధకులు. వారానికి రెండు బీర్లు తాగడం వల్ల హార్ట్ ఎటాక్ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం మెండుగా ఉందంటున్నారు.  గతంలో ఇతరులు చేసిన రీసెర్చ్ లను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే వైన్, బీర్లలో గుండెను కాపాడే లక్షణాలు ఉంటాయంటున్నారు.

అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. గుబులు పుట్టే మరో విషయాన్ని చెపుతున్నారు ఆ యూనివర్సిటీ రిసెర్చర్స్..  ఎక్కువగా బీర్లు తాగేవాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువని అంటున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy