రెండు రాష్ట్రాల్లో లారీలు బంద్

lorry-strike

దక్షిణాది రాష్ట్రాల్లో లారీ ఓనర్స్ స్ట్రైక్ కంటిన్యూ అవుతోంది. మన రాష్ట్రంతో పాటు ఏపీ ,తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. లక్షలాది లారీలు ఆగిపోవడంతో సరకు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె నుంచి నిత్యావసర వస్తువులు రవాణా చేసే లారీలకు మాత్రం మినహాయింపునిచ్చారు.

హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో ఆందోళన చేశారు లారీ యజమానులు. బెజవాడ హైవే పై బైఠాయించి నిరసన తెలిపారు. థర్డ్ పార్టీ బీమా ప్రిమియం తగ్గించడం తో పాటు ఏపీ, తెలంగాణకు ఒకే పర్మిట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు లారీ యజమానులు.

వరంగల్ లో ఆందోళన చేశారు లారీ ఓనర్స్ అసోషియేషన్ నేతలు. ఉదయం నుంచే రోడ్లపై లారీలను తిరగకుండా అడ్డుకున్నారు. కిలో మీటర్లమేర లారీలు నిలిచిపోవడంతో ఇతర వాహనాల రాకపోకలకు సమస్యగా మారింది. డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు లారీ ఓనర్స్.

కర్నూల్ జిల్లాలో లారీ యజమానులు సమ్మె చేశారు. దేశ వ్యాప్తంగా డీజీల్, గ్యాస్ ధరలు ఏకీకృతం చేయడంతో పాటు 15 ఏళ్లు దాటిన లారీల పర్మిట్ల రద్దును ఊపసంహరించుకోవాలని  డిమాండ్ చేశారు లారీ ఓనర్స్ . లారీల బంద్ తో సరకు రవాణా ఆగిపోవడంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందిపడ్డారు.

తెలుగు రాష్ట్రాలకు ఒకే పర్మిట్ విధానం ఉండాలన్న లారీ ఓనర్స్…డిజీల్, గ్యాస్ ధరలు దేశ వ్యాప్తంగా ఒకేలా ఉండేలా చూడాలన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy