రెండు రోజుల్లో వంద కోట్లు : బాక్సాఫీస్ వ‌ద్ద భరత్ ప్ర‌భంజ‌నం

mahesh-100-vdfకొరటాల శివ డైరెక్షన్ లో తెర‌కెక్కిన సినిమా భ‌ర‌త్ అనే నేను. మ‌హేష్ బాబు, కైరా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది.  రెండు రోజుల‌లోనే వరల్డ్ వైడ్ గా వంద కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. నాన్ బాహుబ‌లి మూవీగా ఈ సినిమా పాత రికార్డుల‌ని చెరిపేసింది.

ఇటీవ‌ల విడుద‌లైన రంగ‌స్థ‌లం మూడు రోజుల‌లో వంద కోట్లు రాబ‌ట్ట‌గా, భ‌ర‌త్ అనే నేను రెండు రోజుల‌లోనే ఆ మార్క్ చేరుకొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఓవర్‌ సీస్‌ లో రెండు రోజుల్లోనే 2 మిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించినట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఇక ఆస్ట్రేలియాలోను భ‌ర‌త్ అనే నేను మూవీ కొనసాగుతుంది. వీకెండ్‌లో ప‌ద్మావ‌త్ త‌ర్వాత ఎక్కువ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా ఈ మూవీ నిలిచింద‌ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్  ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

శుక్ర‌, శ‌ని వారాల‌లో ఈ మూవీ 284,211 డాల‌ర్స్ ( 1.44 కోట్లు ) సాధించింద‌ని అన్నారు. రానున్న‌రోజుల‌లో ఈ మూవీ మ‌రిన్నిరికార్డుల‌ని చెరిపేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అతి తక్కువ టైంలో సినిమా ఇంత‌టి భారీ వ‌సూళ్ళు సాధిస్తుందంటే సినిమాపై జ‌నాల‌లో ఎంత క్రేజ్ ఉంద‌నేది అర్ధ‌మవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. భరత్ లో మ‌హేష్ సీఎం పాత్ర‌లో కనిపించిన సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy