రెండు రోజుల్లో 300 ఎన్నికల ర్యాలీలు జరపనున్న బీజేపీ

narendra_modi_BJP_01_200మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ లో 25 ఏళ్ల తర్వాత ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీ, ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా రెండు రోజుల్లో దాదాపు 300 ర్యాలీలు నిర్వహించనుంది. మంగళ, బుధ వారాల్లో జరపనున్న ఈ ర్యాలీల్లో రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా ప్లాన్ చేశారు. ఈ ర్యాలీల్లో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు ఉమా భారతి, ప్రకాష్ జవదేకర్, మాజీ క్రికెటర్ నవ జోత్ సింగ్ సిద్దు పాల్గొననున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటంతో, అక్టోబర్ 15 న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ భావిస్తోంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy