రెండు రోజుల శిశువును బలవంతంగా నడిపించారు..!!

assamఈ ఆధునిక యుగంలోనూ మూఢనమ్మకాలను నమ్మి ఎన్నో నష్టాలను కోరి తెచ్చుకుంటున్నవారు ఇంకా ఉన్నారనడానికి ఈ సంఘటనో మచ్చుతునక మాత్రమే. అసోం లోని మోరిగాన్ కు చెందిన తల్లిదండ్రుల నిరక్షరాస్యతకు నిలువుటద్దం ఈ ఉదాహరణ. మూఢనమ్మకాలను నమ్మి రెండు రోజుల శిశువును నడిపించారు. రెండు రోజుల క్రితం పుట్టిన కొడుక్కి బాగా జ్వరం రావడంతో డాక్టర్లను సంప్రదించడానికి బదులు ఓ మంత్రగత్తెను వారు ఆశ్రయించారు. జ్వరం తగ్గాలంటే బలవంతంగా.. బట్టలు లేకుండా నడిపించాలని మంత్రగత్తె చెప్పింది. అంతే.. గ్రామస్తుంతా చూస్తుండగానే రెండు రోజుల బాలుడిని తల్లిదండ్రులు మెడ పట్టుకొని మరీ బలవంతంగా నడిపించారు. అయితే, ఆ శిశువును అలా నడిపిస్తుండగా…గ్రామంలోని వారు మొబైల్ లో వీడియో తీసి పోలీసులకు పంపించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆ మంత్రగత్తెను అరెస్ట్ చేసి ఆ శిశువును హాస్పిటల్ కు పంపి చికిత్స అందిస్తున్నారు.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy