రెండు వేరియంట్లలో షియోమి రెడ్‌మి 3ఎస్

xiaomi_redmi_3sచైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను అందిస్తూ యూజర్లను బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే రెడ్ మి 1ఎస్,2ఎస్ పేరుతో ఫోన్లను రిలీజ్ చేసిన కంపెనీ తాజాగా ఈ సిరీస్ లో 3ఎస్ పేరుతో మరో డివైస్ ను విడుదల చేసింది. రెండు వేరియంట్లో లభించే రెడ్ మి 3ఎస్ ని ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన షియోమి ఇప్పుడు ఈ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ వారంలోనే ఫోన్ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే రెడ్‌మి 3ఎస్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
రెడ్ మి 3ఎస్ ఫోన్ స్పెసిఫికేషన్స్:
» 5 ఇంచెస్ హెచ్ డీ టచ్ స్క్రీన్
» ఆడ్రినో 505 గ్రాఫిక్స్
» క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 430 ఆక్టాకోర్ ప్రాసెసర్
» 2జీబీ/3జీబీ ర్యామ్
» 16జీబీ/32జీబీ ఇంటర్నల్ మెమొరీ
» 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 4100 mAh బ్యాటరీ

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy