రెండో టెస్ట్.. డే 2: ఇండియా 358/5

CoueeB4XYAAHZ_Vవిండీస్ టూర్ లో టీమిండియా సమష్టిగా రాణిస్తోంది. రెండో టెస్ట్‌లో తొలి రోజు బౌలర్లు రాణించగా.. రెండో రోజు బ్యాట్స్ మెన్ ప్రతాపం చూపించారు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (158, 303 బంతుల్లో 15×4, 3×6) సెంచరీతో చెలరేగడంతో భారత్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 358/5 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో విండీస్ 196 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రహానె (42), సాహా (17) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ 162 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. విండీస్‌ బౌలర్లలో చేజ్‌ రెండు వికెట్లు తీయగా.. గాబ్రియల్‌, బిషూ చెరో వికెట్‌ తీశారు.

 

ఓవర్‌నైట్‌ స్కోరు 126/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత బ్యాట్స్‌మెన్లు రాహుల్‌, పుజరా విండీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. లంచ్‌ బ్రేక్కి ముందే ఓపెనర్‌ రాహుల్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత పుజరా (46) రనౌట్‌ రూపంలో వెనుదిరిగాడు. వీళ్లిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దూకుడుగా ఆడుతున్న రాహుల్‌కు కోహ్లి తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. గాబ్రియల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు రాహుల్.  అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రహానె, కోహ్లితో కలిసి మరోసారి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశారు. అయితే కోహ్లి (44) చేజ్‌ బౌలింగ్‌లో రాజేంద్ర చంద్రికకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన అశ్విన్‌(3) నిరాశ పరిచాడు. బిషూ బౌలింగ్‌లో ఎల్బీ రూపంలో ఔటయ్యాడు. దీంతో భారీ స్కోరు దిశగా పయనిస్తున్న భారత్‌ను విండీస్‌ బౌలర్లు కొంత వరకు కట్టడి చేయగలిగారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy