రెండో టైటిల్ కొట్టిన షరపోవా..!

sharapova_and-haleepఫ్రెంచ్ ఓపెన్ 2014 మహిళల సింగిల్స్ టైటిల్ మరియా షరపోవాదే.  ఫైనల్ లో ఫోర్త్ సీడెడ్ సిమోనా హలీప్ పై 6-4, 6-7 (5), 6-4 తేడాతో గెలిచి కెరీర్ లో రెండో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెల్చుకుంది. 2012 లో టైటిల్ గెలుచుకున్న షరపోవా.. రెండో టైటిల్ నెగ్గి మట్టి కోర్టు మహారాణిగా నిలిచింది. 2013 ఫైనల్ లో సెరెనా విలియమ్స్ చేతిలో ఓడిన రష్యన్ ప్లేయర్.. 2014 కోసం తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు టైటిల్ ను ముద్దాడింది. ఫైనల్ లో సర్వ్ చేయడంలో బాగా ఇబ్బంధి పడినా.. హలీప్ పై అధిపత్యం మాత్రం కోల్పోకుండా చూసుకుంది. మట్టి కోర్టులో షరపోవా ఆట గతంతో పోల్చితే చాలా ఇంప్రూవయ్యింది. కాకుంటే సర్వింగ్ లో మాత్రం కాస్త ఇబ్బంధి పడినట్లు కనిపించింది. 2008లో భుజానికి సర్జరీ అయినప్పట్నుంచీ పోరులో వెనకబడుతున్న షరపోవా.. మూడేళ్లో రెండు టైటిల్స్ సాధించడం విశేషం. అంతకుముందు 2004లో వింబుల్డన్, 2006లో యూ.ఎస్ ఓపెన్, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ గెలుచుకుంది. ఇక మొన్నటి వరకు ఎక్కడో ఉన్నరొమేనియన్ ప్లేయర్ హలీప్.. షరపోవాతో ఫైనల్ లో పోరాడటంతో వరల్డ్ 3వ ర్యాంకుకు చేరుకుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy