రెండో బిడ్డకు ఓకే

Child Policy in Chinaచైనాలో జనాభాను కంట్రోల్ చేయడానికి కొన్ని దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఒక దంపతులకు ఒకే సంతానం విధానానికి అధికారికంగా  తెరపడింది. ఇక నుంచి ప్రతి జంట ఇద్దరు పిల్లలకు జన్మనివ్వొచ్చు. ఈ బిల్లుకు ఆమోదం లభించింది. వచ్చే జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఓ జంట ఇద్దరు పిల్లల సంతానం పాలసీని గత అక్టోబరులో చైనా ప్రభుత్వం ప్రకటించింది.
చైనాలో పేదరికం… అధిక జనాభా కారణంగా 1970ల్లో దంపతులకు ఒకే సంతానం పాలసీని అమలు చేశారు. ఆ తర్వాత చైనాలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. జనాభాను నియంత్రించడంతో పాటు చైనా ఆర్థికంగా ఎదిగింది. రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు వీలుగా చట్టాన్ని సవరించాలని ఇటీవల డిమాండ్లు వచ్చాయి. గ్రామీణులు ఇప్పటికే మొదటి సంతానం ఆడబిడ్డ పుడితే రెండో బిడ్డకు జన్మనిస్తున్నారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy