రెడ్డి జనసంఘం చరిత్ర ఘనమైంది : సీఎం కేసీఆర్

KCRహైదరాబాద్ పాతబస్తీలోని అలియాబాద్‌లో రెడ్డి జనసంఘం వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. వజ్రోత్సవ వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్ గోల్డెన్ జూబ్లీ స్థూపాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెడ్డి జనసంఘం చరిత్ర ఘనమైందన్నారు సీఎం . 75 ఏళ్లుగా రెడ్డి జనసంఘం సమాజసేవ చేస్తుందన్నారు. ట్యాంక్‌బండ్‌పై రాజాబహదూర్ వెంకటరామారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రెడ్డి హాస్టల్ విస్తరణ కోసం హైదరాబాద్ పరిసరాల్లో 10 ఎకరాల స్థలం కేటాయిస్తాం.. రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. ఈ వేడుకల్లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి హాజరయ్యారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy