రెడ్డి హాస్టల్ కు రూ.10 కోట్లు..10 ఎకరాల స్థలం

nayaniరెడ్డి హాస్టల్‌ శతాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు హోంమంత్రి నాయిని నర్శింహారెడ్డి. ఈ నెల 22న కొత్వాల్‌ వెంకట రామిరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు హోంమంత్రి. బుధవారం సచివాలయంలో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌లో రెడ్డిహాస్టల్ కోసం రెడ్డి ఎడ్యుకేషన్‌ సొసైటీకి రూ.10 కోట్లు, 10 ఎకరాల స్థలం మంజూరు చేశామన్నారు. 22న ఈ స్థలంలో హాస్టల్‌ కాంప్లెక్స్‌ తదితర భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు సీఎం కేసీఆర్‌.

గ్రామీణ ప్రాంత పేద రెడ్డి విద్యార్థులకు నగరంలో వసతి కల్పించి, విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో 1917లో రాజాబహదూర్‌ వెంకట్రామి రెడ్డి నగరంలో రెడ్డి హాస్టల్‌ను స్థాపించారు. అబిడ్స్‌లో 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హాస్టల్‌లో ప్రస్తుతం వెయ్యి మందికి పైగా విద్యార్థులు వసతి పొందుతున్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, జస్టిస్‌ జీవన్‌ రెడ్డితో పాటు పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఇక్కడ వసతి పొందడం విశేషం. విలేకరుల సమావేశంలో చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, ఓఎస్టీ దేశపతి, హాస్టల్‌ కమిటీ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రఘుపతి రెడ్డి, కమిటీ సభ్యులు నర్సింహా రెడ్డి, మాజీ ఎమ్యెల్సీలు జగదీశ్వర్‌ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి పాల్గొన్నారు.

మరో పదేళ్లు సీఎంగా కేసీఆరే

తమ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరని, మరో పదేళ్లు సీఎంగా కేసీఆరే ఉంటారని జోష్యం చెప్పారు నాయిని. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రెడ్డి కులస్థులు కుట్ర చేస్తున్నారని ప్రభుత్వంలోని కొందరు బహిరంగంగా చర్చించుకుంటున్నారని విలేకరులు ఆయన దృష్టికి తేగా, అసెంబ్లీలో చాలా మంది ఎమ్యెల్యేలు ఉన్నారని, రెడ్డి కులస్థులు అన్ని పార్టీల్లో ఉన్నారని, తమ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదన్నారు నాయిని నరసింహారెడ్డి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy