రెడ్ మీ నోట్ 4  పేలింది

redmi_note_4మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తోన్న షియోమీ రెడ్ మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ పేలింది. సిమ్ కార్డు వేసేందుకు షాపు నిర్వాహకుడు ప్రయత్నిస్తుండగా.. ఫోన్ పేలిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.  స్థానిక పూర్వికా మొబైల్ స్టోర్‌లో అర్జున్ అనే యువకుడు రెడ్ మీ నోట్ 4 ఫోన్‌ను కొనుగోలు చేశాడు. అందులో కొత్త సిమ్ వేసేందుకు ఓ మొబైల్ షాప్‌కి వెళ్లగా.. సేల్స్ సిబ్బంది సిమ్ స్లాట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే ఆ ఫోన్ ద్వారా మంటలు వచ్చి.. పేలిపోయిందని టెక్ కేస్ రిపోర్ట్ చేసింది.

ఈ పేలుడు కారణంగా ఫోన్ పూర్తిగా కాలిపోగా.. ఎవరికీ గాయాలు కాలేదని సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. జూలై 17న ఈ ఘటన చోటు చేసుకోగా.. విషయం తెలుసుకున్న సంస్థ.. మరో కొత్త ఫోన్‌ను కస్టమర్‌కు అందించింది. వినియోగదారుల భద్రత విషయంలో ఏ మాత్రం రాజీ పడబోమని షియోమీ స్పష్టం చేసింది. ఫోన్ ఎలా కాలిపోయిందనే విషయమై ఆ సంస్థ దర్యాప్తు చేపట్టింది.

చాలా వరకు ఫోన్లు ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఓవర్ హీట్ కారణంగా పేలుతుంటాయి. కానీ నోట్ 4 మాత్రం.. ఛార్జర్‌కు కనెక్ట్ కాకుండానే ఫోన్ పేలడంతో కస్టమర్లు భయాందోళనకు లోనవుతున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy