రెడ్ వైన్ తో మెమరీ పెరుగుతుందా..?

redwine2వైన్ తాగే వారికి మెమరీ పెరుగుతుందా..అంటే అవుననే అంటున్నారు సైంటిస్టులు. రైడ్ వైన్ తాగే వారి గురించి జరిగిన రీసెర్చ్ లో ఈ విషయం తేలింది. రెడ్ వైన్ తాగే వారిలో జ్ఞాపక శక్తి పెరుగుతుందని తేలింది. ఇక రెడ్ వైన్ తో పాటు డార్క్ చాక్లెట్లు తిన్నా కూడా మెమొరీ పెరుగుతుందని సర్వే పలితాల్లో వెల్లడైంది. ఈ రెండింటితో కాస్త జ్ఞపక శక్తి మెరుగవుతుందని రుజువైంది.

రెడ్ వైన్ తో పాటు డార్క్ చాక్లెట్లలో రక్షణ కల్గించే గుణం, జ్ఞాపక శక్తి  పెంచే అంశాలు ఉన్నాయని సైంటిస్టులు నిరూపించారు. ఎన్నో రకాల టెస్టులు చేసిన తర్వాత ఈ విషయాన్ని ప్రకటించారు. రెడ్ వైన్, డార్క్ చాక్లెటే కాకుండా.. రెడ్ గ్రేప్స్, పీ నట్స్, బ్లూబెర్రీస్ లాంటి ఫ్రూట్స్ కూడా ఈ లక్షణాలు కలిగి ఉంటాయని తెలిసింది. అయితే ఈ విషయం పూర్తిగా రుజువు అయ్యేందుకు మరికొన్ని ప్రయోగాలు అవసరమవుతాయని సైంటిస్టులు తెలిపారు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy