రెపో రేటులో మార్పులేదు: రఘురామ్ రాజన్

RAJAN_RBIమార్కెట్ వర్గాలు ఊహించినట్లుగానే..రిజర్వ్ బ్యాంక్  కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. మానిటరి పాలసీ రివ్యూను ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ ..ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను ఆర్ధిక వృద్ది రేటు గతంలో అంచనా వేసినట్లుగానే 7.4 శాతంగా ఉంటుందని తెలిపారు. మరో పక్క  2017 నాటకి ద్రవ్యల్భణాన్ని 5 శాతం లోపు నియంత్రించ విధంగా చర్యల తీసుకోవాల్సి అవసరం ఉందని రఘురామ్ రాజన్ అన్నారు.

రిజర్వ్ బ్యాంక్  ప్రకటించిన మానిటరీ పాలసీ సమీక్షలో రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం రెపో రేటు 6.75 శాతంగా ఉంది.  ద్రవ్యోల్భణం ఇంకా అనుకున్న స్థాయికి దిగిరాకపోవడం, తయారీ తో పాటు ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వడ్డీ రేట్లు తగ్గించకపోవడానికి కారణమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు.

క్రూడాయిల్ ధరల దిగివచ్చినా, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి రిటైల్ ఇన్ ఫ్లేషన్ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందిన అన్న ఆర్బీఐ గవర్నర్  మార్చి 2017 నాటికి ఇన్ ఫ్లేషన్ 5 శాతం దిగువకు పరిమితమవుతుందన్న అశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ గణాంకాలు ప్రోత్సహకరంగా ఉండటంతో  గతంలో అంచనా వేసినట్లుగా దేశ స్థూల జాతీయోత్పత్తి 7.4 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది

భారత్‌లో బంగారం డిమాండ్ నానాటికీ తగ్గిపోతోంది. దేశీయంగా బంగారం ధరలు ఆరేళ్ళ కనిష్ఠ స్థాయికి దిగివచ్చాయి. గత పండుగ సీజనులో బంగారం అమ్మకాలు పెంచుకోవాలని భావించిన ఆభరణాల వ్యాపారులకు నిరాశే ఎదురైంది. వరుసగా రెండేళ్లు కరవుతో  రైతుల వద్ద ఆదాయం లేకపోవడం, ధరలు మరింతగా తగ్గుతాయని వచ్చిన విశ్లేషణలతో బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారని బులయన్ వర్గాలు అంటున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. రూపాయి విలువ రెండేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది.  డాలరుతో రూపాయి మారకం విలువ ప్రస్తుతం  66.69 కి చేరింది. దిగుమతిదారుల నుంచి అమెరికన్ కరెన్సీ కోసం వచ్చిన డిమాండ్ కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో భారత రిజర్వు బ్యాంకు జోక్యం చేసుకుని డాలర్ల విక్రయానికి దిగకుంటే , సమీప భవిష్యత్తులో డాలర్‌తో రూపాయి మారకపు విలువ రూ.68ని తాకవచ్చన్నది కరెన్సీ రంగ నిపుణుల అంచనా. చెన్నైను ముంచెత్తిన భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు భారీగా నష్టపోయారు. ఈ లెక్కలు ఇపుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా.. ఈ వరదల కారణంగా ఆటో ఇండస్ట్రీ ఒక్కదానికే 1500 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్టు అసోచామ్ ప్రాథమికంగా అంచనా వేసింది.  చెన్నై ఆటో ఇండస్ట్రీ దేశంలో రెండవ అతిపెద్దది. దేశ వాహన అవసరాల్లో 25 శాతం వరకూ చెన్నై మార్కెట్ తీరుస్తోంది. చిన్న, మధ్య తరహా  విడి భాగాల తయారీ పరిశ్రమలు చెన్నైలో ఉన్నాయి. ఇప్పుడీ కంపెనీల్లో మూడు నుంచి నాలుగడుగుల మేరకు నీరు నిలిచి పోయింది. వాహన సంస్థలతో పాటు ఇంజనీరింగ్, టెక్స్ టైల్స్ తదితర విభాగాల్లోని కంపెనీలూ దారుణంగా దెబ్బతిన్నాయి.

చెన్నైనగరంలోని ప్రధాన వాహన తయారీ కంపెనీల యార్డుల్లో సుమారు 20 వేల నుండి 25 వేల వాహనాల అమ్మకాలు ఆగిపోయాయి. గత వారం రోజులుగా ఫోర్డ్ ఇండియా ప్లాంట్ మూతపడగా, ఐదు రోజుల నుంచి రినాల్ట్ నిస్సాన్ ప్లాంట్‌ మూతపడింది. చెన్నై కేంద్రంగా వాహనాల విడిభాగాలు తయారు చేసి ఎగుమతి చేస్తున్న జపాన్ సంస్థ సిన్సాన్,  మరో నాలుగు రోజుల తర్వాతనే ఉత్పత్తిని తిరిగి చేపట్టనున్నట్టు వెల్లడించింది. హుందాయ్ మోటార్స్ వారం రోజుల క్రితం నుంచి ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కంపెనీలన్నీ ఎప్పుడు ఉత్పత్తిని ప్రారంభిస్తాయన్న విషయమై స్పష్టత లేదు. ఇకపై ఉద్యోగులు ఆన్‌లైన్ ద్వారానే పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పించనుంది కేంద్రం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ మేరకు చర్యలు చేపట్టనున్నట్లు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కేకే జలాన్ తెలిపారు. అయితే ఉద్యోగి తన ఈపీఎఫ్ ఖాతాకు బ్యాంక్ అకౌంట్‌తో పాటు ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా జతచేసుకోవాలని జలాన్ సూచించారు. ప్రస్తుతం ఉన్న లిఖిత పూర్వక దరఖాస్తు విధానాన్ని పూర్తిగా మార్చి ఆన్‌లైన్‌ను ప్రవేశపెట్టనున్నామన్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్ నగదు తీసుకోవాలంటే ఉద్యోగికి.. సంస్థ అనుమతి తీసుకోవాలి. ఇకపై సంస్థతో సంబంధం లేకుండా నేరుగా ఉద్యోగి తన పీఎఫ్ మొత్తాన్ని పొందవచ్చు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy