రెప్పపాటులో బతికి బట్టకట్టాడు

accident-2అదృష్టవంతుడంటే  అతడే. చావునోట్లోకెళ్లి  క్షణాల్లో  ప్రాణాలతో  బైటపడ్డాడు. స్పాట్ లో చూసినొళ్లు  కూడా షాకయ్యారు. లారీ కింద  నుజ్జునుజ్జు  అయ్యాడనుకున్న వ్యక్తి … ఎంచక్కా లేచి నడుచుకుంటూ  వెళ్లిపోయాడు. ఇదంతా రెప్పపాటులో  జరిగిపోయింది. చైనాలో ఓ వ్యక్తి .. బైక్ పై  వెళ్తుండగా మృత్యురూపంలో  లారీ దూసుకొచ్చింది.   సైడ్ నుంచి లారీ స్పీడ్ గా  వస్తుంది. అంతే  స్పీడ్ లో  బైక్ ఉంది. ప్రమాదం తప్పదని  ఉహించి  వెంటనే బైక్ ను  పడేశాడు. బైక్ లారీ  కిందపడి నుజ్జు నుజ్జైంది.  అతడు మాత్రం  చావు దగ్గరకెళ్లి రెప్పపాటులో  ప్రమాదం నుంచి  బైటపడ్డాడు. ప్రమాదం తర్వాత  బైక్ పై  వచ్చిన వ్యక్తి తనకేమి  జరగలేదన్నట్లుగా  రోడ్డు దాటుకుంటూ  వెళ్లిపోయాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy