రెప్పపాటు కాలంలో..బతికి బయటపడ్డాడు

delhi metroతృటిలో ప్రాణాలనుంచి బయట పడ్డాడు ఓ యువకుడు. మెట్రో రైల్ ట్రాక్ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు…డ్రైవర్ అలర్ట్ కావడంతో బతికిపోయాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలోని శాస్త్రీనగర్ మెట్రో రైల్వే స్టేషన్‌లో జరిగింది. మయూర్ పటేల్ అనే 21 ఏళ్ల యువకుడు మెట్రో రైలు ఓ ట్రాక్ నుంచి వెళ్లేందుకు రెఢీగా ఉన్న సమయంలో దాని ముందు నుంచి.. పటేల్ ఆ ట్రాక్ దాటబోయాడు. మరో ఫ్లాట్‌ఫాంపైకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఆ ట్రాక్‌పై ఉన్న రైలు కదలడంతో భయంతో  వణికి పోయాడు.. దీంతో ట్రాక్ మీద నుంచి ఫ్లాట్‌ఫాం పైకి ఎక్కలేక పోయాడు. మెట్రో రైలు కింద ఆ యువకుడి పడిపోబోయాడు. విషయాన్ని గమనించిన లోకో పైలట్ అలర్టయి..వెంటనే రైలును నిలిపివేశాడు. డ్రైవర్ బ్రేక్ వేయడంతో మయూర్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసుల యువకుడిని ఆధీనంలో తీసుకుని …జరిమానాతో విధించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy