రేఖను అమ్మా అన్న ఐష్

1బాలీవుడ్ మీడియా ఓ విషయం పై తెగ హడావుడి చేస్తోంది. శాన్ సుయ్ స్టార్ డస్ట్ అవార్డ్స్ కార్యక్రమంలో జజ్బా మూవీలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను ఐశ్వర్యాయ్ కి ఉత్తమ నటి అవార్డ్ వచ్చింది. అ వార్డును సీనియర్ నటి రేఖ చేతుల మీదుగా అందజేయాలని నిర్వాహకులు డిసైడ్ అయ్యారు. రేఖ స్టేజీపైకి వెళ్లాక..అవార్డును తీసుకునేందుకు ఐష్ వచ్చింది. అవార్డు తీసుకునే ముందు రేఖ కాళ్లకు ఐశ్వర్య నమస్కారం చేసింది. ఆ తర్వాత రేఖ ఐశ్వర్యకు అవార్డు అందించారు. దీంతో ఐష్..థ్యాంక్యూ అమ్మా అని అంది. అదే టైంలో కెమెరాలన్నీ వాళ్లిద్దరిపై కాకుండా బిగ్ బి పై కూడా ఫోకస్ చేశాయి. ఎందుకంటే అమితాబ్- రేఖల మధ్య రోమాన్స్ జరిగిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఐష్…రేఖను అమ్మా అని పిలవడంతో అమితాబ్ అయోమయంగా  చూశాడట. దీనిపై బాలీవుడ్ ఇండస్ట్రీ రచ్చ రచ్చ చేస్తోంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy