రేట్లు అలా ఉంటే… పండగెలా?

pulses_660_101215052656సామాన్యుడి దసరా పండగకు గ్యారెంటీ లేకుండా పోయింది. పండగ చేసుకోవడం కన్నా పస్తులుండటం బెటరనే స్థాయికి పెరిగాయి ధరలు. కంది, పెసర, శెనగ, మినపపప్పు.. ఇలా అన్ని పప్పు ధరలు… ఒకేసారి అమాంతం పెరిగాయి. సామాన్యుడి ఇంట్లో  ఉడకనంటున్నాయి. పప్పుల ధరలన్నీ అటు ఇటుగా డబుల్ సెంచరీకి రీచ్ అయ్యాయి. పప్పుల ధరలకు ఆయిల్ రేట్లు తోడయ్యాయి. వీటి రేట్లు సలసలా కాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే… పప్పులూ, నూనెల ధరలు వంద నుంచి 150 శాతం వరకు పెరిగాయి.

మొన్నటిదాకా ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తే.. పండగ సీజన్ లో పప్పుల ధరలు టెన్షన్ పెడుతున్నాయి. దసరా జరుపుకోవాలంటే నెలబడ్జెట్ సరిపోని పరిస్థితి సామాన్యులది. కిలో కందిపప్పు కాస్త అటు ఇటుగా 180కి చేరింది. గతేడాది దసరా టైంలో కందిపప్పు ధర 74 రూపాయలు మాత్రమే. ఇక మినప్పప్పు మార్కెట్లో 180ని తాకింది. దసరా వరకు దీని ధర రెండు వందలు కావొచ్చు. గతేడాది ఇదే టైంలో మినపపప్పు ధర వంద. ఇపుడు 130కి చేరింది. శనగపప్పు ఏడాదిలో డబుల్ అయింది. ఇపుడు మార్కెట్లో  శనగపప్పు కొనాలంటే 80 రూపాయలు పెట్టాల్సిందే. పెసర పప్పు ధర అటు ఇటుగా 130కి చేరింది.

నెల రోజుల వ్యవధిలో పప్పులు, వంట నూనెల, చక్కెర, బెల్లం, బియ్యం ధరలు కేజీకి అటు ఇటుగా 50 రూపాయల దాకా పెరిగాయి. అన్ని రకాల నూనె ధరలకు లీటర్ ప్యాకేట్ సెంచరీని కొట్టాయి. రెండొందలు పెట్టి కందిపప్పు కొనేబదులు… రెండు కిలోల చికెన్.. ఐదు కేజీల ఉల్లి కొనుక్కోవచ్చన్న అభిప్రాయానికొస్తున్నారు. పప్పుల జోలికెళ్లే బదులు నాన్ వెజ్ కు.. పనీర్, మసాలాలు జోడించి మరింత గ్రాండ్ గా చేసుకోవడం బెటరనుకుంటున్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ధరల మోత మోగుతోంది. పప్పు ధాన్యాలను ఎక్కువగా సాగుచేసే మహారాష్ట్ర, కర్నాటక, బీహార్ లాంటి రాష్ట్రాల్లో సాధారణం కంటే 14 శాతం తక్కువ వర్షపాతం నమోదవడం కూడా రేట్ల పెరుగుదలకు కారణమంటున్నారు ఎక్స్ పర్ట్స్. పండ్లు, కూరగాయల ధరలు కూడా రెండు నెలల్లో భారీగా పెరిగాయి. ధరలు దిగిరావాలన్నా… సామాన్యుడు పండగ చేసుకోవాలన్నా… ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy