రేడియో జాకీగా శిల్పాషెట్టి

ss22శిల్పా …మంచి యాక్టర్…అంతకు మించి బెస్ట్ ఫిట్ నెస్ కోచ్..బిజినెస్ లో టాప్… మంచి ప్రొగ్రామ్ జడ్జి..ఇవే కాదు వెరీ స్పెషల్ రేడియో జాకీ …ఇదే కొత్త విషయం . రేడియో జాకీ గా దుమ్ముదులిపేయడానికి రెడీ అవుతుంది ఈ పొడుగు కాళ్ల సుందరి. నాలుగు పదుల వయసులోనూ.. చెక్కు చెదరని ఆరడుగుల శిల్పం శిల్పా శెట్టి. పర్ఫెక్ట్ హైట్…క్యూట్ స్మైల్..బ్యూటీ ఫుల్ స్రక్చర్ తో బీటౌన్ లో బిజీ వుమెన్ గా మారిపోయింది ఈ సుందరి. అప్పుడప్పుడు స్క్రీన్ పై మెరుస్తూనే..అవుట్ అండ్ రైట్ బిజినెస్ తో రఫ్ ఆడిస్తోంది . అమ్మడు అందం ఇండియన్స్ నే కాదు..అటు లండన్ సిటిజన్స్ కూడా ఫుల్ ఫిదా అయిపోయారు.

రియాల్టీ షోతో..భామ కెరీరే మారిపోయింది.  స్క్రీన్ షేర్ చేసుకుంటూనే…సైడ్ బిజినెస్ మొదలెట్టింది . అంది వచ్చిన ప్రతి చాన్స్ ను క్యాష్ చేసుకుంది. టైమ్ ఉన్నప్పుడే…సంపాదించాలన్న కాన్సెప్ట్ ను వంటినిండా కప్పేసుకుంది శిల్పా.  అందుకే బీబీసీ రేడియో -2 తో లిజనర్స్ ను అట్రాక్ట్ చేయడానికి రెడీ అవుతుంది. లండన్ లో సెప్టెంబర్ నుంచి రేడియో జాకీ గా వస్తున్నా నంటోంది ఈ ముద్దుగుమ్మ.

బీబీసీ -2 కోసం అప్పుడే మెలోడి క్వీన్ లతా మంగేష్కర్, కరణ్ జోహర్ తో ప్రొగ్రామ్ ఫిక్స్ చేసిందంటోంది ఈ యోగా క్వీన్. ఇక శిల్ప వేలు పెడితే…పక్కాగా అది సక్ససే ..మరి ఈ షో ఎంత మందిని క్లీన్ బౌల్డ్ చేస్తుందో చూడాలి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy