రేణు సంచలనం : నా కొడుకు పవర్ స్టార్ కాదు

akira

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అభిమానం, ప్రేమ ఎవరికి ఉండదు. ఒక్క పిలుపు ఇస్తే అభిమానులు తరలివస్తారు. పవన్ పేరుతో పవనిజం పుట్టుకొచ్చింది. అలాంటిది తన కొడుకు మాత్రం జూనియర్ పవర్ స్టార్ కాదు అని చెబుతోంది రేణుదేశాయ్. అకీర బర్త్ డే సందర్భంగా.. రేణు చేసిన ఈ ట్విట్ సినీ ఇండస్ట్రీని కుదిపేసింది. మిగతా హీరోల కుమారులు అందరూ తండ్రి ఇమేజ్, బిరుదులను కొనసాగింపుగా వస్తుంటే.. రేణు మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించటం పవర్ స్టార్ అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పుడే పదమూడేళ్ళు… తన చిన్నిబాబు.. అప్పుడే సిక్స్ ఫూట్ బాయ్ అవ్వడం నమ్మలేకపోతున్నానని సంబరపడింది. తల్లిదండ్రుల నీడలో కాకుండా తనకంటూ ఓ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలి.. అకీరా నందన్ గానే గుర్తింపు తెచ్చుకుంటాడు. ఎప్పటికీ జూనియర్ పవర్ స్టార్ కాదని పోస్ట్ చేశారు. ఈ కామెంట్స్ సంచలనం అయ్యాయి. పవర్ స్టార్ కొడుకుగా కాకుండా.. అకీరానందన్ పేరుపైనే గుర్తింపు పొందాలని రేణు భావించటం వెనక ఉద్దేశాలను రకరకాలుగా అన్వయించుకుంటున్నా.. ఓ తల్లిగా మాత్రం తన కొడుకు తన కాళ్లపై ఎదగాలని ఆశించటంలో తప్పులేదు కదా అంటున్నారు మరికొందరు. ఏమైనా హ్యాపీ బర్త్ డే అకీరా..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy