నేటితోనైనా ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చేనా..?

Newswala-i-Telangana_employees_protest_DEO_1ఉద్యోగుల విభజనపై గందరగోళానికి నేటితో తెరపడనుంది. ఇప్పటికే మార్గదర్శకాలు రెడీ అయినా…ఎవరికి ఆప్షన్లు ఉంటాయో..ఉండవో తెలియడం లేదు.  ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలను వెబ్ సైట్లో పెట్టనుంది కమల్ నాథన్ కమిటీ. దీంతో రేపటితో ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రధానంగా రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీకి సంబంధించి క్లారిటీ ఇవ్వనుంది కమల్ నాథన్ కమిటీ.

తెలంగాణ ఉద్యోగులు లేవనెత్తిన పలు సమస్యలతో పాటు కొన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చిన కమల్ నాథన్ కమిటీ మిగతా పోస్టుల విభజనను కొలిక్కి తీసుకురానుంది. విధివిధానాలపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపిన కమిటీ నెట్ లో పెట్టేందుకు రెడీ అయ్యింది. ఉద్యోగుల విభజనకు స్థానికతకే కమల్ నాథన్ పెద్ద పీఠ వేసినట్లు తెలుస్తోంది. దీనిలో భార్యాభర్తలకు, ఎస్సీ, ఎస్టీ లతో పాటు ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉన్నవాళ్లకు ఆప్షన్లు ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి వెబ్ సైట్లో పెట్టే మార్గదర్శకాలతోనైనా ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy