రేపటి నుంచే ‘రాజీవ్ స్వగృహ’ ఆన్ లైన్ వేలం

befunky_prasanthienclave.jpgరాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ ను E-వేలంలో అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆన్ లైన్ లో ఓపెన్ బిడ్డింగ్ ద్వారా ఫ్లాట్స్ అమ్ముతున్నట్టు గృహ నిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈనెల 7 నుంచి 17 దాకా పది రోజుల పాటు బిడ్డింగ్ జరగనుంది.

హైదరాబాద్ సిటీలోని బండ్లగూడలో రాజీవ్ స్వగృహ ప్లాట్లను శుక్రవారం మంత్రి  సందర్శించారు.  రాష్ట్రంలో ఉన్న ఇలాంటి ప్లాట్లను ఇకపై E-వేలంలో అమ్మనున్నారు.  మొదటి దశలో బండ్లగూడ, పోచారంలో నిర్మించిన 3 వేల 718 ప్లాట్ల ను ఓపెన్ బిడ్డింగ్ లో సేల్ చేస్తారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తరపున E-బిడ్డింగ్ నిర్వ హిస్తోన్న కేంద్ర ప్రభుత్వరంగ  సంస్థ ఎంఎస్టీసీ ఆన్ లైన్ ప్రక్రియను మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి పరిశీలించారు. ఈనెల 7 నుంచి పది రోజుల పాటు వేలంపాటలు జరుగుతాయి. అప్పట్లో గృహ నిర్మాణ శాఖ  అన్నిమౌలిక వ స తుల తో ప్లాట్ల ను నిర్మించింద న్నారు మంత్రి ఇంద్ర క ర ణ్ రెడ్డి. ప్లాట్లు కొనేవారికి ఎస్బీఐ, ఎస్బీహెచ్ లోన్స్ ఇచ్చేందుకు  సిద్ధంగా ఉన్నాయ న్నారు.

 

మొదటి దశలో బండ్లగూడలో 2 వేల 244, పోచారంలో 1474 ప్లాట్లను గృహ నిర్మాణ శాఖ సేల్ కు పెట్టింది. వీటిల్లో కొన్ని అసంపూర్తిగా మిగిలి ఉన్నాయి. వాటిని కొనుక్కున్నవాళ్ళే పూర్తి చేసుకోవాలి.  ప్ర తి ప్లాటుకు ప్ర త్యేకంగా ధ ర  నిర్ణ యించి ఆన్ లైన్ లో అమ్ముతారు. బండ్ల గూడ లో కనిష్టంగా ఎస్ఎఫ్-టి రూ. 2,200 రూపాయలు, పోచారంలో కనిష్ఠ ధ ర రూ.1700 గా నిర్ణయించారు. ఫినిషింగ్ అయిన ప్లాట్స్ ధరలు ఇంకా పెరుగుతాయి. మొత్తమ్మీద ప్లాట్స్ అమ్మకంతో గృహ నిర్మాణ శాఖకు  900 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అధికారులు అంచ నా వేస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy