రేపు ఓలా, ఉబర్ బంద్

Ola_Uberఫైనాన్సర్ల వేధింపులు, క్యాబ్‌ డ్రైవర్‌ల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఈ నెల 23న(సోమవారం) ఉబర్, ఓలా క్యాబ్‌ సర్వీసులను నిలిపివేయనున్నట్లు తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్‌ అండ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. లక్షన్నర కార్లు ఈ రెండు సంస్థల్లో తిరుగుతున్నాయని, రూ.లక్షలు అప్పులు తెచ్చి కార్లు కొనుక్కున్న ఎంతోమందికి కనీస ఉపాధి లభించడం లేదన్నారు. ఫైనాన్సర్ల వద్ద వాయిదాలు చెల్లించలేక, వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తోందన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy