రేపు కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్న ముత్యంరెడ్డి


తొగుట : దుబ్బాక కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి చెరకు ముత్యంరెడ్డి టీఆర్ ఎస్ లో చేరడానికి రంగం సిద్ధమైంది. రేపు(మంగళవారం) సిద్దిపేటలో నిర్వహించే బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరతారని ప్రకటించారు మంత్రి హరీశ్‌రావు. ఆదివారం దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి చెరకు ముత్యంరెడ్డిని తొగుటలోని ఆయన నివాసంలో కలిశారు హరీశ్‌ రావు. కాంగ్రెసులో టికెట్‌ రాకపోవడంతో విచారంలో ఉన్న మాజీ మంత్రితో వారిద్దరు అరగంట పాటు చర్చించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో ముత్యంరెడ్డి, రామలింగారెడ్డిలు కీలకపాత్ర పోషించారన్నారు. మిగిలిన నాయకులకు కనీసం నియోజకవర్గ అభివృద్ధిపై అవగాహన కూడా లేదన్నారు. ముత్యంరెడ్డి… సీఎం కేసీఆర్‌ అత్యంత సన్నిహితులని, ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయన్నారు హరీశ్ రావు. ముత్యంరెడ్డి దుబ్బాకకే పరిమితం కాదని జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తెరాస తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని చెప్పారు. రామలింగారెడ్డి, ముత్యంరెడ్డిలు కలిశాక ఇతర నాయకులు రాజకీయ తుపానులో కొట్టుకుపోవడం ఖాయమన్నారు. తన విన్నపాన్ని మన్నించి పెద్దమనసుతో టీఆర్ఎస్ లో చేరేందుకు అంగీకరించిన ముత్యంరెడ్డికి తన సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. అనంతరం ముత్యంరెడ్డి మాట్లాడుతూ తనవద్ద డబ్బులు లేవనే కారణంతోనే కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వలేదంటూ కన్నీటి పర్యంతమై.. ఏమీ మాట్లాడలేక చేతిలోని మైక్‌ హరీశ్‌రావుకు ఇచ్చారు. అనంతరం మంత్రి, రామలింగారెడ్డిలు ఆయన్ను ఓదార్చారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy