రేపు పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు

మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రేపు (బుధవారం) హైదరాబాద్ పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు పోలీసులు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పాతబస్తీతోపాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయన్నారు. ఈ దారుల్లో వెళ్లే వాహనదారులు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు ట్రాఫిక్ ఉన్నతాధికారులు. ఈ క్రమంలనే నగర పోలీసు కమిషనర్ సోమవారం సాలార్జంగ్ మ్యూజియంలో పాతనగరానికి చెందిన మతపెద్దలతో సమీక్ష నిర్వహించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి 2 వేల మంది పోలీసులను మోహరిస్తున్నారు. ర్యాలీ సాగే దారిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy