రేపు పార్లమెంట్ కు పోలవరం ఆర్డినెన్స్..

download (3)పార్లమెంట్ కు రేపు పోలవరం ఆర్డినెన్స్ చట్ట రూపంలో రానుంది. కేంద్ర ప్రభుత్వం పోలవరం విషయంలో మొండిగా వ్యవహరిస్తోంది. తెలంగాణ వాయిస్ ను లైట్ గా తీసుకోంది. పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలపడాన్ని నిరసిస్తూ చేస్తున్న ఆందోళనలను, నిరసనలను పట్టించుకోకుండా ముందుకెళ్తుంది. తాజాగా కూడా పోలవరంపై ముందుకెళ్లాలని నిర్ణయించుంకుంది కేంద్రం. పోలవరం ఆర్డినెన్స్ ను చట్టంగా మారుస్తూ ఏపీ విభజన బిల్లుకు సవరణలకు ప్రతిపాదించనున్నారు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్.

ఇక పోలవరం ఆర్డినెన్స్ పై ఎప్పుడు చర్చించాలో బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. రేపు ఆర్డినెన్స్ ను చట్టంలో ప్రవేశపెడుతూ ముంపు మండలాలను ఏపీలో ఎందుకు కలుపుతున్నారో రాజ్ నాథ్ వివరణ ఇవ్వనున్నారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా పోలవరం ఆర్డినెన్స్ ను అడ్డుకోవాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. ఎంపీలు కూడా బిల్లును ఎట్టిపరిస్ధితుల్లోనూ అడ్డుకోని తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దులు మార్చే బిల్లును వ్యతిరేకిస్తామని కరీంనగర్ ఎంపీ వినోద్ తెలిపారు. గిరిజనుల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా హాడావుడిగా ఎందుకు నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ ఎంపీలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా కేంద్రం ఆర్డినెన్స్ పార్లమెంట్ లో పెట్టడం సరికాదని తెలంగాణ గొంతు నోక్కడమే అని ఎంపీలు చెప్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy