రష్యా వెళుతున్న ప్రధాని మోడీ

modi-foreignప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రష్యా వెళుతున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఆయన రష్యాకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో వార్షిక సమావేశంలో భాగంగా ఈ పర్యటన సాగుతోంది. ఈ సమావేశంలో అణుశక్తి, హైడ్రోకార్బన్స్‌, రక్షణ, వ్యాపార రంగాలకు సంబంధించి రెండు దేశాల మధ్య సంబంధాలు పెంచే అంశంపై చర్చించనున్నారు. గురువారం సమావేశాల తర్వాత రెండు దేశాలు ఈ రంగాలకు సంబంధించి పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. 2000 సంవత్సరం నాటి నుంచి రష్యా, ఇండియాలు ఓ ఏడాది మాస్కోలో… ఓ ఏడాది న్యూఢిల్లీలో రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నాయి.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy