రేపు రాష్ట్రానికి రాహుల్: టూర్ షెడ్యుల్ ఖరారు

రేపు(శనివారం,అక్టోబర్-20) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. నాందేడ్ నుంచి బైంసాకు రానున్నారు. 20న బైంసాలో 12.30 నుంచి 1.30 వరకు బహిరంగ సభలో పాల్గొననున్నారు.తర్వాత మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు చార్మినార్ దగ్గర రాజీవ్ సద్భావన దినోత్సవంలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 7 గంటలకు శంషాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాహుల్ రాష్ట్రానికి వస్తుండటంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆయన పర్యటించే ప్రాంతాల్లోట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy