రేపే ‘అమ్మ‘ ప్రమాణ స్వీకారం..!!

jaya-650_051311033836ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం

శనివారం ఉదయం 11 గంటలకు అమ్మ ప్రమాణ స్వీకారం

తమిళనాడు అంతా కోలాహలం

తన క్యాబినేట్ మినిస్టర్స్ లిస్టును గవర్నర్ కు సమర్పించిన అమ్మ

అమ్మ మౌనం వీడింది. అజ్ఞాతంలో నుంచి బయటకొచ్చింది. అక్రమాస్తుల కేసులో పదవి పోగొట్టుకుని ఎనిమిది నెలలుగా పోయేస్ గార్గెన్ పరిమితమైన పురచ్చితలైవి.. ఫైనల్ గా అభిమానులకు దర్శన భాగ్యం కల్పించారు. అందుకే తమిళనాడులో ఈ కోలాహాలం. జయలలిత ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. శాసన సభాపక్ష నేతగా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పార్టీ ఎమ్మెల్యేలు. ఆ కార్యక్రమం పూర్తయ్యాక గవర్నర్ రోశయ్యను కలిసి ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు జయ. రేపు ప్రమాణస్వీకారం చేయబోయే తన క్యాబినెట్ మినిస్టర్స్ లిస్టును గవర్నర్ కు సమర్పించారామె. మరోవైపు పన్నీర్ సెల్వం రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. గవర్నర్ ను కలిశాక చైన్నైలోని అన్నాదురై, ఎంజీఆర్, ఈవీ రామస్వామి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు పురచ్చితలైవి. తర్వాత చైన్నై అవ్వాయ్ షణ్ముగం సాలైలోని పార్టీ హెడ్ ఆఫీస్ లో పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు.

ప్రమాణస్వీకారానికి చెన్నైలోని చెపాక్ క్యాంపస్ రెడీ అయింది. అయితే జయ ప్రమాణస్వీకారానికి బాంబు బెందిరింపులొచ్చాయి. దాంతో చెపాక్ క్యాంపస్ ను పోలీసులు జల్లెడపట్టారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాలతో ఐడెంటిటీ కార్డులున్న వాళ్లకే ఎంట్రీ ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు. జయ ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఫిక్స్ అవడంతో… పన్నీర్ సెల్వం ఎనిమిది నెలల పాలన పూర్తైంది. అక్రమాస్తుల కేసులో కర్నాటక స్పెషల్ కోర్టు శిక్ష విధించాక… గతేడాది సెప్టెంబర్ 29న పన్నీర్ సెల్వం సీఎంగా ఎన్నికయ్యారు. ఇపుడు అమ్మ కోసం త్యాగం చేశారు. జయ కోసం పన్నీర్ సెల్వం సీఎం సీటును త్యాగం చేయడం ఇది రెండో సారి. 2001లో టాన్సీ కేసులో అరెస్టయ్యారు జయ. అప్పుడు ఆర్నెళ్ల పాటు సెల్వం సీఎంగా ఉన్నారు. మొత్తానికి తమిళనాడుకు ఐదోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు జయలలిత.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy