రేపే ‘కాలా’ ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్

kaalaసూపర్‌స్టార్‌రజనీకాంత్ సినిమా వస్తోందంటే చాలు అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. ఆయనకు ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా తెరకెక్కిన రజనీ కాంత్ సినిమా కాలా. కబాలి ఫేం పా.రంజిత్‌ ఈ సినిమాకు డైరెక్టర్ . ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రేపు రిలీజ్ కానుంది.

సినిమా నిర్మాత ప్రముఖ హీరో, రజనీ అల్లుడు ధనుష్‌. మే 9న ఆడియో ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నట్లు..మంగళవారం (మే 1) సాయంత్రం ఏడు గంటలకు ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు ట్వీట్‌ చేశాడు. ఈ సినిమాలో బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రముఖులు నటించారు. ఈ సినిమాకు కబాలి ఫేం సంతోష్ నారాయణ్‌ మ్యూజిక్ అందించారు. కాలా సినిమా జూన్‌ 7న రిలీజ్ కానుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy