రేపే గుజరాత్ తొలి దశ పోలింగ్: బరిలో హేమాహేమీలు

gujarat elecగుజరాత్ లో తొలి దశ ఎన్నికల ప్రచారం గురువారం(డిసెంబర్-7)తో ముగిసింది. శనివారం(డిసెంబర్-9) ఉదయం 89 నియోజకవర్గాల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. మొదటి దశలో చాలా మంది హేమాహేమీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా పశ్చిమ రాజ్‌కోట్‌ స్థానం నుంచి గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంద్రనిల్‌ రాజ్‌యాగు రు ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. 1985 నుంచీ ఈ స్థానం బీజేపీకి కంచుకోటగా ఉంది. మణినగర్‌కు వెళ్లకుమందు 2002లో ప్రధాని మోడీ ఇదే స్థానం నుంచి పోటీ చేసి సీఎం అయ్యారు. కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగిన ఇంద్రనీల్‌ తూర్పు రాజ్‌కోట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయినప్పటికీ కుల సమీకరణాల్లో భాగంగా ఆయన్ని పశ్చిమ రాజ్‌కోట్‌కు మార్చారు. మరోవైపు, గుజరాత్‌లో కాంగ్రెస్‌ గెలుపొందితే సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ను సీఎంను చేస్తారనే తూర్పు సూరత్‌లో పోస్టర్లు చివరి రోజు ప్రచారంలో దర్శనమిచ్చాయి. ఇదిలా ఉండగా, తొలిదశ పోలింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో పాటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌కు సంబంధించిన మరో సెక్స్ సీడీ కలకలం సృష్టించింది. ఓ మహిళతో హార్దిక్‌, అతడి స్నేహితులు ఉన్నట్లుగా బుధవారం(డిసెంబర్-6) వెలుగులోకి వచ్చిన క్లిప్పింగ్‌ వైరల్‌ అయ్యింది. అయితే.. ఫేక్‌ వీడియోలను సృష్టిస్తూ బీజేపీ రాజకీయం చేస్తోందని పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి కో కన్వీనర్‌ బంభానియా ఆరోపించారు.

చివరి రోజు ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల తరపున ముఖ్యనేతలు పాల్గొన్నారు. సూరత్ లో మోడీ, మెహసనాలో అమిత్ షా, రాజ్ కోట్ లో యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అహ్మదాబాద్ లో వినూత్నంగా లేజర్ తో టెక్నాలజీతో ప్రచారం చేశారు బీజేపీ నేతలు. మోడీని ట్విట్టర్ లో తొమ్మిదో ప్రశ్న అడిగారు రాహుల్ గాంధీ. గుజరాత్ రైతులకు రుణమాఫీ జరగలేదని, పంటలకు కనీస మద్దతు ధర కూడా అందడం లేదని ఆరోపించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy