
పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ చేపట్టనున్నారు. ప్రచారం శనివారంతో ముగిసింది. పోలింగ్ కు ఒక్క రోజే ఉండటంతో..అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఓటర్లను ఎలాగైన తమవైపు రాబట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లకు మద్యం, నగదు పంపిణీకి ఆదివారం రాత్రంతా జాగారానికి సిద్ధమవుతున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు. తమను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి రూ.లక్షల్లో ఖర్చు చేస్తామంటూ కొన్నిచోట్ల ఏకగ్రీవాలు చేసుకున్నారు. మరికొన్నిచోట్ల ఆ సొమ్మును కుల, గ్రామ కమిటీలకు ఇస్తున్నారు.