రేపే స్టేట్ కేబినెట్ భేటీ

2014-07-17_223846_kcr_announceరాష్ట్ర కేబినెట్ సమావేశం శనివారం సెక్రటేరియట్ లో జరగనుంది. 23 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలపైనే.. ప్రధానంగా ఫోకస్ పెట్టే చాన్స్ ఉంది. సభలో చర్చించాల్సిన అంశాలు, ప్రాధాన్యతలపై డిష్కషన్ చేయనున్నారు సర్కార్ పెద్దలు. పరిశ్రమలకు భూకేటాయింపులు, ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగే చాన్స్ ఉంది. పాయింట్ బ్లాంక్ లో విమర్శల్ని ఎక్కుపెట్టిన విపక్షాల్ని.. ధీటుగా ఎదుర్కొనే రూట్ మ్యాప్ రెడీ చేసే చాన్స్ ఉంది. రైతు ఆత్మహత్యలపై కేబినెట్ ప్రధానంగా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఆత్మహత్యల నివారణ, ఎక్స్ గ్రేషియా పెంపుపై చర్చిస్తారని టాక్. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఈ ఏడాది జూలై 24 వరకు..409 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సర్కారీ లెక్కలే చెబుతున్నాయి. 141 మంది రైతుల కుటుంబాలకు ..ఒక్కొక్కరికి లక్షన్నర చొప్పున ఆర్థిక సహాయం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సర్కార్ చెప్పిన లెక్కల కంటే ..ఎక్కువగా రైతులు చనిపోయారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రైతులకు ఇచ్చే పరిహారాన్ని కూడా 5 లక్షలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలతో సర్కార్ పై ఒత్తిడి పెరుగుతోంది. సేమ్ టైమ్ ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు..బాబు సర్కార్ 5లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తోంది. ఇక్కడ కూడా 5లక్షలు చెల్లించే అవకాశాలున్నాయని సమాచారం. కేబినెట్ నిర్ణయం తర్వాత సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.  పరిహారం పెంచకుంటే..సర్కార్ కు బ్యాడ్ నేమ్ వచ్చే ప్రమాదముందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ..అవసరమైతే 5 లక్షలకు పైగానే పరిహారం ఇస్తామని సీఎం ప్రకటించే చాన్స్ ఉంది.

పారిశుద్ధ్య కార్మికుల సస్పెన్షన్, అశా వర్కర్ల అందోళన, కాంట్రాక్టుల కార్మికుల క్రమబద్ధీకరణ,  ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు వంటి అంశాలు కేబినెట్ లో చర్చించే చాన్స్ ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా విపక్షాలు ఈ సమస్యలపై ప్రశ్నించే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి  చైనా టూర్ పైన మంత్రివర్గ సమావేశంలో  చర్చ జరిగే చాన్స్ ఉంది. పది రోజుల చైనా టూర్ పై మంత్రులకు..కేసీఆర్ వివరించే అవకాశాలున్నాయి.

సమగ్ర జలవిధానానికి కేబినెట్ ఆమోదముద్ర వేసే చాన్స్ ఉంది. జలవిధానంపై సర్కార్ ఇప్పటికే కసరత్తు చేస్తోంది.  ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ పై చర్చించే అవకాశాలున్నాయి.  హైదరాబాద్ అభివృద్ది పై కేబినెట్ సబ్ కమిటీ నివేదికలపై కూడా చర్చ జరిగే అవకాశాలున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy