రేప్ కేసులో ఆశారాం దోషి

Asaram-Bapu-jailపదహారేళ్ల మైన‌ర్‌ అమ్మాయిని రేప్ చేసిన కేసులో ఆశారాంను దోషిగా తేల్చుతూ జోధ్‌పూర్ కోర్టు తీర్పునిచ్చింది. 2013లో జరిగిన రేప్ కేసులో ఇవాళ జోధ్‌పూర్‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ కోర్టు తుది తీర్పును వెల్లడించింది. మణి గ్రామంలో ఉన్న ఆశ్రమంలో… ఆశారాం  16 ఏళ్ల బాలికను రేప్ చేశాడు. ఆ కేసులో 2013 ఆగస్టు 31న అతన్ని అరెస్టు చేశారు. యూపీకి చెందిన షాజహాన్‌పూర్ గ్రామస్తురాలైన ఆ యువతి చికిత్స కోసం ఆశ్రమానికి వెళ్లింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివ‌, శిల్పిల‌ను కూడా దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది.మ‌రో ఇద్ద‌రు శ‌ర‌ద్‌, ప్ర‌కాశ్‌ల‌ను కోర్టు నిర్దోషులుగా ప్ర‌క‌టించింది.

2013 ఆగస్ట్ 3న తనపై ఆశారాం బాపు అత్యాచారం చేశారని ఓ మైనర్ బాలిక కేసు పెట్టింది. అహ్మదాబాద్ సిటీ శివార్లలోని ఆశ్రమంలో తాను ఉన్నప్పుడు 1997-2006 మధ్య పలుమార్లు తనపై ఆశారాం లైంగిక దాడులకు పాల్పడ్డారని సూరత్ కు చెందిన బాలిక కేసు పెట్టింది. యూపీలోని షాజహాన్ పూర్ కు చెందిన ఆమె ఆశారాం ఆశ్రమంలో స్టూడెంట్ గా ఉండేది. మైనర్ బాలిక కేసుతో.. 2013లోనే ఆశారాంని అరెస్ట్ చేశారు జోధ్ పూర్ పోలీసులు. అప్పట్నించి జోధ్ పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు ఆశారాం. గతంలో బెయిల్ కోసం పలుమార్లు పిటిషన్లు దాఖలు చేసినా కోర్టు నిరాకరించింది. తీర్పు సందర్భంగా మైనర్ బాలిక నివాసముంటున్న షాజహాన్ పూర్ లోనూ టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు పోలీసులు. బాలిక ఇంటి దగ్గర రౌండ్ ద క్లాక్ ఇద్దరు కానిస్టేబుళ్లతో రక్షణ ఏర్పాట్లు చేశారు.  సీసీటీవీలను ఏర్పాటు చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy