రేప్ కేసులో బాలీవుడ్ నిర్మాత అరెస్ట్

kareem-moraniఅత్యాచారం కేసులో రాత్రి హయత్ నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు బాలీవుడ్ నిర్మాత కరీం మొరాని.  వైద్య పరీక్షల తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరుచనున్నారు. రామోజీ ఫిలిం సిటీలోని సితార హోటల్ లో తనపై అత్యాచారం చేశాడని జనవరి 10న హయత్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది బాధిత హైదరాబాద్ యువతి. దీంతో అరెస్టు కాకుండా రంగారెడ్డి  కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు మొరాని. పోలీసుల అభ్యంతరంతో మొరాని ముందస్తు బెయిల్ ను రంగారెడ్డి కోర్టు రద్దు చేసింది. దీంతో హైకోర్టుకు వెళ్లాడు. బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు.. పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ఆ తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లాడు మొరాని. సుప్రీం కోర్టు కూడా హైకోర్టు  నిర్ణయాన్ని సమర్ధించిది. దీంతో హయత్ నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు కరీం మొరాని. ఉస్మానియాలో వైద్య పరీక్షల తరవాత.. మొరానీని రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy