
ఈ కేసు విషయమై అప్పట్లో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు బాలిక ఇచ్చిన వాగ్మూలంతో పోలీసులు బాలిక తల్లిని అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అలాగే పరారీలో ఉన్న తండ్రి కోసం గాలిస్తున్నారు పోలీసులు. నిందితుల నుంచి డబ్బు తీసుకున్న తల్లిదండ్రులు కోర్టులో నిందితులకు అనుకూలంగా చెప్పాలంటూ బాలికను ఒప్పించేందు ప్రయత్నించారు. అయితే అందుకు ఆమె తిరస్కరించడంతో బాలికపై తల్లిదండ్రులు చేయి చేసుకున్నట్లు పోలీసులకు వివరించింది బాలిక.
2017 ఆగస్టులో బాలిక అదృశ్యమవడంతో తల్లిదండ్రులు కేసు పెట్టారు. వారం తర్వాత ఈ కీచకుల బారి నుంచి బయటపడిన బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ఇద్దరు వ్యక్తులు బంధించి వారం రోజులుగా రేప్ చేశారని పోలీసులకు తెలుపడంతో నిందుతులిద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పట్నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తుండగా..ఇప్పుడు డబ్బులు ఇచ్చిన ఘటన బయటపడింది. దీంతో తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను చైల్డ్ హోమ్ లో చేర్చారు.