రైతన్న గోస: ఆఖరుకి అరక కూడా భారమాయెనా.!

nagaliరైతు అంటే.. జోడెద్దులు.. అరక.. ఆరెకట్టె గుర్తుకొస్తాయి. పొలంలో నాగలితో దున్నుతూ.. భూతల్లిపై కోటి ఆశలతో నడిచే ఆ రైతన్న చెమట చుక్కలు గుర్తొస్తాయి. సమాజపు ఆకతి తీర్చే రైతన్నకు ఇప్పుడు ప్రతీది భారవమైపోయింది. ఇప్పటి వరకు విత్తనాలు, ఎరువులు మాత్రమే భారమనుకుంటే.. ఆఖరుకి అరక కూడా కష్టమైపోయింది. భూస్వాములకు పర్వాలేదు కానీ.. చిన్న, సన్నకారు రైతులకు పెద్ద ఖర్చే అవుతోంది. దీనికి పక్క చిత్రమే పెద్ద ఉదాహరణ.  కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లిలో నడుస్తోంది ఈ చిత్రంలో కనిపిస్తున్న అద్దె అరక. ఈ గ్రామంలో అరక అద్దె రోజుకు 1400 రూపాయలు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు భూమి దున్నాలి. ఒక్క అరక రోజుకు ఎకరం వరకు దున్నుతుంది.  అయితే ఈ గ్రామానికి పరిసర గ్రామాల్లో అరక అద్దె రూ.1600వరకు ఉందటా. దీనిని బట్టి అద్దె డిమాండ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయం ప్రధానమైన ఉమ్మడి జిల్లా నిజామాబాద్‌ అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. రెండు, మూడు ఎకరాలున్న రైతు ట్రాక్టర్ తో దున్నించుకోలేడు. అద్దె అరక మరి ఫిరమై పోతుంది. అయిన తప్పదు..రైతుకు తిప్పలు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy