రైతుకు సాయంపై గ్రామాల్లో సర్వే

farmers-telanganaరైతు పెట్టుబడి పథకంపై రాష్ట్రమంత్రివర్గ ఉపసంఘం సమీక్ష జరిపింది. రాష్ట్రంలో రైతులకు ఎకరాకు నాలుగు వేల ఆర్థిక సాయం విధివిధానాలపై చర్చించింది. మంత్రులు జిల్లాలు తిరిగి అభిప్రాయాలు తీసుకుంటున్నారని… రేపు మరోసారి సమావేశం అవుతామని మంత్రి పోచారం చెప్పారు.

వ్యవసాయ పంటలకు పెట్టుబడిగా నాలుగు వేల రూపాయల సాయం పథకం విధివిధానాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. సెక్రటేరియట్ లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఉపసంఘంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్ రావు, ఈటల, కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్ శర్మ సభ్యులుగా ఉన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ముందస్తు పెట్టుబడిగా ప్రతి సీజన్ కు ఎకరాకు నాలుగువేల రూపాయలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు చేర్చే అంశంపై సభ్యులు చర్చించారు.

రెవిన్యూ రికార్డుల ప్రక్షాళన తర్వాత ఎ కేటగిరి కింద రాష్ట్రంలో 71 లక్షల 75 వేల మంది రైతు ఖాతాలు ఉన్నట్లు లెక్క తేలిందన్నారు మంత్రి పోచారం. మొదటి సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు గ్రామాలలో సభలు, సమావేశాల ద్వారా రైతులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెల్సుకుంటున్నారని చెప్పారు. రైతులకు ఉన్న అకౌంట్లలో నగదు జమచేస్తే… పాత బకాయిల కింద జమకడతారన్న సందేహాలున్నాయన్నారు. దీనిపై రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అభిప్రాయాన్ని కోరామన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పథకం విధివిధానాలు ఖరారుచేస్తామన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. విధివిధానాలపై చర్చించేందుకు జనవరి పదోతేదీన కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశం కానుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy