రైతుజీవిత బీమాకు ప్రత్యేక యాప్

farmersరైతులను అన్ని విధాల ఆదుకునేందుకు చర్యలు చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం రైతుబంధు జీవిత బీమా. దీని కోసం ప్రత్యేక యాప్‌ను వినియోగించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌ (NIP) తయారు చేసిన ఈ యాప్‌ను ఇప్పటికే వ్యవసాయ విస్తరణాధికారుల (AEO) ట్యాబ్‌ల్లో ఇన్‌స్టాల్‌ చేశారు. నామినీ, బీమా దరఖాస్తుల నమూనా ఆధారంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. రైతుబంధు జీవిత బీమా పథకం అమలుకు ఈ నెల 4న LICతో వ్యవసాయశాఖ అవగాహన అగ్రిమెంట్ కుదుర్చుకుంది.

రాష్ట్రంలోని 30 జిల్లాలకు బీమాతో పాటు నామినీ దరఖాస్తులను పంపామని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో AEO రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారని, మరికొన్ని జిల్లాల్లో సోమవారం నుంచి ప్రారంభిస్తామన్నారు. దరఖాస్తులోని వివరాలను యాప్‌లో నమోదు చేసి, ఆ సమాచారాన్ని ఎల్‌ఐసీకి పంపనున్నారు. ఇక, క్షేత్రస్థాయిలో వచ్చిన సమాచారంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ ఎప్పటికప్పుడు పరిశీలించనున్నది.

ఆధార్‌ కార్డు ఆధారంగా రైతుల వయసును నిర్ణయిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఆధార్‌లో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే జూలై మొదటి తేదీని పుట్టిన రోజుగా లెక్కలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. యాప్‌లో రైతుల సమాచారంతో పాటు ఆధార్‌ నెంబర్‌ను నమోదు చేయడం వల్ల డూప్లికేషన్‌కు అస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నమోదు చేస్తున్న వివరాల్లో ఏమైనా మార్పులు చేర్పులుంటే సవరించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy