రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: కడియం

maxresdefaultరాష్ట్రంలోని రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు.. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భరోసానిచ్చారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం రైతు సమస్యలతో పాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా నాలుగు గంటలకు పైగా చర్చింది.  ఆ తర్వాత మీడియాతో డిప్యూటీ సీఎం కడియం మీడియాతో మాట్లాడారు.

  • రైతులను ఆదుకునేందుకు అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నాం
  • జిల్లాల వారీగా రైతు ఆత్మహత్యలపై సమాచారం సేకరిస్తున్నాం
  • ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరిహారం పెంచాం
  • ఇవాళ్టి నుంచి రూ. 6 లక్షలు పరిహారం ఇస్తాం
  • ఇందులో రూ. 5 లక్షలు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ఇస్తాం.
  •  మిగతా లక్షా రూపాయాలు రైతు చేసిన అప్పులు కడుతాం.
  • ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబంలో పెళ్లికి ఎదిగిన అమ్మాయి ఉంటే… కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆదుకుంటాం.
  • పెంచిన పరిహారం ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తుంది
  • ఇప్పటికే రుణాల మాఫీ కోసం రూ. 8,500 కోట్లను బ్యాంకులకు చెల్లించాం.
  •  విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూశాం. కోతల్లేని విద్యుత్‌ను సరఫరా చేశాం
  •  వచ్చే ఏప్రిల్ 1 నుంచి పగటిపూట 9 గంటల కరెంట్ రైతులకు సరఫరా
  • సెప్టెంబర్ 30 తర్వాత కరువు మండలాలను ప్రకటిస్తాం
  • రాష్ట్రంలో త్వరలోనే అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ పోస్టులు భర్తీ చేస్తాం
  •  ప్రస్తుతం 1100 మంది ఏఈవోలు పని చేస్తున్నారు. అదనంగా మరో 1000 ఏఈవో పోస్టులను మంజూరు
  •  ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒకరి చొప్పున అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌ను నియమిస్తాం
  •  మెదక్ జిల్లా ములుగులో ఫారెస్ట్ కళాశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం
  • రాష్ట్రంలో నాలుగు రిజర్వ్ బెటాలియన్లు
  •  నాలుగు బెటాలియన్లకు సంబంధించి 3,896 పోస్టులు భర్తీ చేస్తాం
  • ఇందులో కానిస్టేబుల్ నుంచి కమాండర్ స్థాయి వరకు పోస్టులు
  • పారిశ్రామికవేత్తల కోసం మూడు ట్రస్ట్ గ్రూప్‌లు
  •  చైనా, జపాన్, కొరియా, తైవాన్ పారిశ్రామికవేత్తల కోసం ట్రస్ట్ గ్రూప్-1
  • అమెరికా, కెనడా పారిశ్రామికవేత్తల కోసం ట్రస్ట్ గ్రూప్-2
  •  గల్ఫ్, భారత పారిశ్రామికవేత్తల కోసం ట్రస్ట్ గ్రూప్-3 ఏర్పాటు

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy