రైతులుగా మారిన చిన్నారులు : వ్యవసాయంపై విద్యార్థులకు అవగాహన

దేశానికి అన్నంపెట్టే అన్నదాత గురించి విద్యార్థి దశలోనే తెలియజేయాలని హైదరాబాద్ లోని ఓ స్కూల్ లో అవేర్ నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. వ్యవసాయం ఎలా చేస్తారు.. పండించిన పంటను ఎలా రైతుబజార్ కు చేరుస్తారు అనే విషయాలను విద్యార్థులకు తెలిపారు. ఈ క్రమంలోను చిన్నారులు రైతుల వేషంలో వచ్చి, స్కూల్ లో ఏర్పాటుచేసిన రైతుబజార్ లో కూరగాయలు అమ్మారు.

సోమవారం (ఆగస్టు-20) హైదరాబాద్ , జూబ్లిహిల్స్ లోని భారతీయ విద్యాభవన్ స్కూల్ లో రైతుబజార్ నమూనా ఏర్పాటుచేశారు. స్కూల్ లోని ప్రీ ప్రైమరీ స్కూడెంట్స్ సంతలో కూరగాయల దుకాణాల మాదిరిగానే స్టాళ్లు ఏర్పాటు చేసుకొని కూరగాయలు అమ్మారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. రైతుల్లాగే తయారైన చిన్నారులను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. చిన్నారులకు చిన్నతనంలోనే వ్యవసాయంపై అవగాహన, రైతుబజార్ మార్కెట్ లో కూరగాయలు అమ్మడంలాంటివి తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపింది స్కూల్ యాజమాన్యం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy