రైతులు శాసించే స్థాయికి రావాలి: మంత్రి కేటీఆర్

ktrవ్యవసాయ రంగంలో ఉన్న ఆనందం మరే వృత్తిలో ఉండదన్నారు మంత్రి కేటీఆర్. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు వ్యవసాయమన్నారు. రైతులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సిరిసిల్ల జిల్లాలో రైతు బంధు పథకంపై అవగాహన సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించినట్లు తెలిపారు.  అంతేకాదు రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరముందన్నారు. నాలుగేళ్లలో 24 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించినట్లు తెలిపారు. రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని..ప్రాజెక్టులు కడుతుంటే..రైతులకు సాయం చేస్తుంటే అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy