రైతులే.. గ్రామ కథానాయకులు : కేసీఆర్

kcrమేడ్చల్ జిల్లా.. మూడు చింతలపల్లిలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఆ గ్రామంపై వరాల జల్లు కురిపించారు. ఆ గ్రామ సభలో ఆయనేమన్నారంటే… ఎస్.వెంకటరెడ్డి, వీరారెడ్డి… ప్రాతఃస్మరణీయులు… మూడుచింతలపల్లి గ్రామ బిడ్డలే. 1969లో డాక్టర్ చెన్నారెడ్డికి అండగా.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. వీరారెడ్డి పేరుమీద ఇక్కడ హాస్పిటల్ కట్టిస్తాం. ఆరునెలల్లో పూర్తి అవుతుంది. వీరారెడ్డి ప్రజావైద్యశాలగా నామకరణం చేస్తున్నాము. అంతేకాదు మూడు చింతలపల్లి, లక్ష్మాపూర్ చెరువులు నిండుతాయి. కాలువ తవ్వకాలు పూర్తై వచ్చే ఏడాది నీళ్లు వస్తాయి. ప్రతి సంవత్సరం నింపుతారు. సంవత్సరం పొడవునా నీళ్లుంటాయి. వచ్చే ఏడాది వర్షాకాలం పూర్తయ్యే లోపు నీళ్లు చేరతాయన్నారు.

చీకటిమామిడి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం, యాదాద్రి వరకు ఆర్టీసీ బస్సు, ముప్పై, నలభై ఎకరాల్లో స్టేడియం ఏర్పాటు చేస్తాం. గ్రామానికి ఒక మల్టీపర్పస్ హాల్, శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామని… బుధవారం సాయంత్రం వరకు 5 ట్రాన్స్ ఫార్మార్లు  ఏర్పాటు చేస్తాం. తండాను ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేద్దాం… మహిళా సంఘాలకు అర ఎకరం స్థలంలో భవన్ నిర్మిస్తామన్నారు. కలెక్టర్ ఎంవీ రెడ్డి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడంలో ముందుంటారు. లక్ష్మాపూర్, కేశవరం, మూడుచింతలపల్లిల అభివృద్ధి కోసం వారికి రూ.5 కోట్లు మంజూరు చేస్తాం.

ఆదాయం సమకూర్చుకోవడంలో 21.7శాతం వృద్ధితో మనదే నంబర్ వన్ రాష్ట్రం. ఈ ధైర్యం… అలా వచ్చిందే. డబ్బులున్నాయి.. ఆదాయం ఉంది.. పనులు చేసుకుందాం… బంగారు తెలంగాణ కావాలి.. ఎట్లైతది…. అందరూ కలిసి పని చేయాలి.. పట్టుబట్టాలి…. అన్నారు.

నీళ్లు, కరెంట్, పెట్టుబడి ఇవ్వాలి. రైతులకు ఇవి ఉంటే వ్యవసాయం చేసుకుంటాడు. ఎన్ని ఎకరాలు ఉన్నా పెట్టుబడి ఇస్తాం.. రూపాయి లేకున్నా పాస్ బుక్ లు ఇస్తామన్నారు.  గ్రామ రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేసి.. వాటి ద్వారా రైతులకు డబ్బులు ఇస్తామన్నారు. ఏ గ్రామ రైతులు .. ఆ గ్రామానికి కథానాయకులు.

2000 ఎకరాలకు పైగా అటవీ భూమి ఉంది… అక్కడ అడవీలా ఉందా… లేదు.. అడవులు ధ్వంసం అయిపోయాయి. తెలంగాణకు హరితహారాన్ని సర్పంచులు ఎందుకు సీరియస్ తీసుకోవడంలేదని ప్రశ్నించారు. వీఆర్వోలు, వీఆర్ఏలు, సఫాయి, కర్మాచారులు ఉన్నారు.. ఎందుకు దృష్టిపెట్టడం లేదని ప్రశ్నించారు.

నా మాట నిలబెట్టాలి..

ఇంటికి ఆరు చెట్లు ఇస్తారు. ఆరుగురు ఉంటే.. ఆరు.. నలుగురుంటే నాలుగు చెట్లు పెట్టాలి…. ఆ చెట్లకు ఇంటి వాళ్ల పేరు పెట్టాలి. చెట్లు ఎండిపోతే.. వాళ్లు ఎండిపోయినట్టు. ఆరు నెలల తర్వాత ఎంక్వైరీ పెడతాను. చెట్లను బాగా పెంచిన వాళ్లకు పశువులు కానుకగా ఇస్తాం.. మీ అన్ని ఇండ్లు విజయం సాధించి.. పాడిపంటలతో వర్ధిల్లాలి..

టాయిలెట్లు వాడకపోతే రూ.100 జరిమానా కట్టాలి. 100  డబుల్ బెడ్ రూమ్ లను కేటాయిస్తాం. నాకు జ్వరం వచ్చినా మీకోసమే వచ్చాను. మీరు విజయం సాధిస్తారనే నమ్మకంతో ఉన్నాను.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy