రైతుల కోసం కేంద్రం ఫసల్ బీమా యోజన

rajnath singhరైతన్నకు భరోసా ఇచ్చేందుకు రెడీ అయింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పేరుతో… పంట బీమాలో మార్పులకు  కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీం కింద పంటలకు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో.. ఖరీఫ్ సీజన్ లో రైతులు 2శాతం చెల్లిస్తే … మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలి. రబీ సీజన్ లో ఈ ప్రీమియాన్ని 1.5శాతం చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. వాణిజ్య పంటలు, ఉద్యానవన పంటలకు మాత్రం 5శాతం ప్రీమియం చెల్లించాలని నిర్ణయించారు. దేశంలో 9వేల 720 లక్షల హెక్టార్ల పంటకు.. బీమ వర్తింపచేయనుంది కేంద్రం. ఈ స్కీం అమలుతో కేంద్రంపై.. 8వేల 8వందల కోట్ల భారం పడనుంది. ఈ పథకంలో ప్రీమియం చెల్లిస్తే.. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినా.. పంట దిగుబడి తక్కువ వచ్చినా.. పంట కోసిన తర్వాత నష్టం జరిగినా..  పూర్తి పరిహారం చెల్లిస్తారు. రైతుల నుంచి తక్కువ మొత్తంలో బీమా ప్రీమియం తీసుకుని.. ఎక్కువ లాభం కలిగించేలా ఈ స్కీమ్ ప్లాన్ చేసినట్టు కేంద్ర మంత్రులు చెప్పారు. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది కేంద్రం. అయితే ఇందుకోసం రాష్ట్రాలు తమ చట్టాలను సవరించకోవాలని సూచించారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy