రైతుల భూములు లాక్కుంటే రాష్ట్రం అభివృద్ధి కాదు: పవన్

pawanచిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ శెట్టిపల్లెలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధికి అన్నదాతల భూములను లాక్కోవడం సరికాదన్నారు. భూ సేకరణ చట్టం కొంత మంది నేతలకు చుట్టంగా మారిందని విమర్శించారు. శెట్టిపల్లి భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని పవన్  కల్యాణ్  అన్నారు.

చిత్తూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన ఐదో రోజుకు చేరుకుంది. శెట్టిపల్లి గ్రామంలో రైతులతో మాట్లాడారు జనసేన అధినేత. ప్రభుత్వానికి మానవతా దృష్టి లేకుంటే ప్రజలు ఇబ్బంది పడతారన్నారు పవన్. పైడిపల్లిలో ఇదే తరహా భూములకు పట్టాలిచ్చి శెట్టిపల్లికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. భూసేకరణ విధానంలో మార్పు తీసుకురావాలని, శెట్టిపల్లి భూములను సమీకరించే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు పవన్.

ఏపీలో రైతు రుణమాఫీపై విమర్శలు చేశారు పవన్. బిందెడు నీళ్లు ఆశ చూపి మూడు చుక్కల నీళ్లు తాగించినట్టుగా రుణమాఫీ ఉందన్నారు. అమరావతి నుంచి శెట్టిపల్లి వరకు గట్టుకో న్యాయం.. చెట్టుకో న్యాయం చేస్తున్నారని మండిపడ్డారు  పవన్ కళ్యాణ్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy