రైతు బాంధవుడు సీఎం కేసీఆర్: ఈటల

etelaసీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడన్నారు మంత్రి ఈటల రాజేందర్‌. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లోని ఇందిరానగర్‌ లో జరిగిన బహిరంగ సభలో ఈటల మాట్లాడారు. పంట పెట్టుబడి పథకం దేశానికే ఆదర్శమన్నారు. రైతు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా 12వేల కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ తన చేతుల మీదుగా రైతులకు అందిస్తున్నారని తెలిపారు. అది కూడా కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభించడం  తమ జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాను వాటర్‌హబ్‌గా తీర్చిదిద్దారని అన్నారు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలతో పల్లెలన్నీ బాగుపడ్డాయని..ఇంకా బాగుపడాల్సిన అవసరముందన్నారు. ఉద్యమ సమయంలో ఎలా అండగా ఉన్నామో..ఇక ముందు కూడా రాబోయే రోజుల్లో కరీంనగర్ అండగా ఉంటుందని ఈటల.. సీఎం కు సభా ముఖంగా తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy