రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా గుత్తా బాధ్యతలు

guthaరాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంగా సంతకం చేశారు. రైతులను సంఘటితం చేసి.. వారికి సూచనలు, సలహాలు ఇస్తూ మరింత ఆదాయం చూపించే విధంగా ఈ సమన్వయ సమితులు పని చేస్తాయన్నారు. అన్ని జిల్లాల సమితులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను అన్నారు కొత్త అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తోపాటు మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, నాయిని, జగదీష్ రెడ్డి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy